![]() |
![]() |

"మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు" అంటూ రీసెంట్ గా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన ఎపిసోడ్ లో స్పెషల్ సెగ్మెంట్ గా సెలబ్రిటీస్ ఫస్ట్ శాలరీ గురించి చాలా విషయాలను శ్రీముఖి బయట పెట్టించింది. ముందుగా చమ్మక్ చంద్రను స్టేజి మీదకు పిలించింది.
1998 లో ఇన్స్టిట్యూట్ లో చేరినప్పుడు ధనరాజ్ తన ఫస్ట్ ఫ్రెండ్ అని ఆ టైంలో రాజా మూవీకి గుంపుగా కొంత మంది ఆర్టిస్టులు కావాల్సి రావడంతో తానూ, ధన్రాజ్ కలిసి జూనియర్ ఆర్టిస్ట్ లుగా చేస్తే రోజుకు 100 లు ఇచ్చారని అలా రెండు రోజులు లైట్ షూటింగ్ చేస్తే 200 లు ఇచ్చారని చెప్పారు. ఆ డబ్బును వేస్ట్ చేయకుండా గుర్తుగా ఉండాలని కోఠీకి వెళ్లి చీర కొన్నట్లు చెప్పారు. తర్వాత అనిత చౌదరిని పిలిచింది శ్రీముఖి. ఈటీవీకి ఫస్ట్ యాంకర్ గా చేసిన తనకు అప్పట్లోనే 3 వేలకు చెక్ అందుకున్నట్లు అదే తన ఫస్ట్ శాలరీ అని చెప్పారు.
ఆ డబ్బులో 1500 లకి పట్టుచీర, మిగతా అమౌంట్ అమ్మకి ఇచ్చినట్లు చెప్పారు. ఇక చలాకి చంటి తన ఫస్ట్ శాలరీ గురించి చెప్పాడు. ట్యాంక్ బండ్ దగ్గర భాగమతి, భగీరధి అనే రెండు బొట్లు ఉండేవని వాటిల్లో ప్రతీ శనివారం స్టాండప్ కామెడీ చేస్తే 500 లు ఇచ్చేవాళ్ళు అని చెప్పాడు. ఇక యాదమ్మ రాజు ఇళ్లకు పాలు, పేపర్ వేసేవాడినని, కార్లు తుడిచేవాడినని అప్పుడు 400 లు వచ్చేవని చెప్పాడు. తర్వాత ఆది తన ఫస్ట్ శాలరీ గురించి చెప్పాడు. అదిరే అభి ద్వారా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆదికి వెయ్యి రూపాయలు చెక్ ఇచ్చినట్లు చెప్పాడు ఆది. ఇలా కమెడియన్స్ అంతా తాము అందుకున్న ఫస్ట్ శాలరీ మెమోరీస్ ని రిక్రియేట్ చేసి ఆడియన్స్ కి చెప్పారు.
![]() |
![]() |